13-12-2024 01:50:58 AM
సిద్దిపేట, డిసెంబర్ 12 (విజయక్రాంతి): కోట్ల రూపాయలు ఉన్నవారి తల్లులకు కిరీటాలు పెడతారేమో కానీ తమలాంటి వారి తల్లులకు కిరీటాలు పెట్టలేమని తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి యంవీ రమణారెడ్డి అన్నారు. కళాకారులుగా తాము తెలంగాణ తల్లిలో తమ తల్లులను చూసుకున్నాం కాని దేవ తా మూర్తులను కాదని స్పష్టంచేశారు.
గురువారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనతో తనకేమి వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయనంటే గౌరవం ఉం దంటూనే విరుచుకుపడ్డారు.
సిద్దిపేట జిల్లా వ్యాస్తవ్యునిగా తెలంగాణ ఉద్యమంలో కిలక పాత్ర పోషించానని, తన గురించి సంపూర్ణం గా తెలిసిన నందిని సిధారెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం రూపమిచ్చినందుకు రూ.15 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పు డు 2015లో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు తొలిసారిగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రదర్శించేందుకు శకటాన్ని (బోనాలు) రూపొందిస్తే అక్కడున్న ఆంధ్రా అధికారులు అడ్డుకున్నారని, తానే స్వయం గా డబ్బులు ఖర్చు చేసి కోర్టు ద్వారా అనుమతి తెచ్చాక..
శకటం తయారు చేసే కాంట్రాక్టు ఆంధ్రవాళ్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఆ శకటం రూపొందించిన బిల్లు ఇప్పటివరకు ఇవ్వలేదని, ఇదే విషయంపై అప్పటి సాహిత్య ఆకాడమీ చైర్మన్ సిధారెడ్డిని కలిశానని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రభు త్వంలో ఉండీ సీఎం కుటుంబంపైనే విమర్శలు చేసిన సిధారెడ్డి.. ఇప్పుడు తాను డబ్బు లు తీసుకుని విగ్రహాన్ని రూపొందించినట్టు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు.
దేశపతికి రూ.5౦ వేలు ఇస్తేనే..
సాహిత్య ఆకాడమీలో రావాల్సిన బిల్లు కోసం తిరిగి తిరిగి అలసిపోయాక ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌కు రూ.50వేలు ఇస్తే తనకు రావాల్సిన బిల్లు ఇచ్చారని రమణారెడ్డి గుర్తుచేశారు. సిధారెడ్డి సాహిత్య ఆకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడు నిర్వహించిన ప్రపంచ తెలు గు మహాసభలలో నిధులు దుర్వినియోగం అయినట్టు ఆరోపణలు, వార్తా కథనాలు వ చ్చాయని.. అవన్నీ నిజాలు అని నమ్మాలా? అని అడిగారు.
ఇలా డబ్బుల కోసమే పనిచేసిన వారికి కళాకారుల కష్టం కనబడదని, అందుకే అర్థరహితమైన ఆరోపణలు చేశార ని విమర్శించారు. ‘మీరు, మీ రాజకీయ పా ర్టీలో పలుకుబడి పొందడం కోసం ప్రభుత్వంపై విమర్శలు చేయండి.. కానీ, కళాకా రులపై ఆరోపణలు చేయడం మీ స్థాయికి తగదు’ అని హితవు పలికారు.
ప్రభుత్వ ఆలోచనల మేరకు శిల్పులు విగ్రహాలను సిద్ధం చేస్తారనే విషయం తెలిసిన పెద్దమనిషి.. రాజకీయ నాయకులు ఉసిగొల్పితే దు ష్ప్రచారం చేయడం తగదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసిన వారికి వారి తల్లి కనించాలి లేదా సాధారణ స్త్రీలా ఉండా లి.. కానీ, ధనిక, రాచరిక వంశస్ర్తురాలై ఉండకుడదని అన్నారు.
అమరుల త్యాగం, ప్రజల భాగస్వామ్యంతో వచ్చిన తెలంగాణకు బ హుజనుల తల్లి కనిపించేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగిందని స్పష్టంచేశారు. నూతన తెలంగాణ తల్లి విగ్రహనికి లభిస్తున్న ఆధరణ చూసి ఓర్వలేకనే ఇలా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శిల్పులను గౌరవించాలి, ప్రోత్సహిం చాలి కాని ఇలా కించపరిచేలా మాట్లాడవద్దని కోరారు.
రాజకీయపరంగా పార్టీలపై, ప్రభుత్వంపై విమర్శలు చేసుకోవాలని.. ఇలా ఆర్టిస్టులను అవమానిస్తే ఆకాశం మీద ఉ మ్మేసినట్టు అవుతుందని ధ్వజమెత్తారు. తన కు ప్రభుత్వం రూ.15 కోట్లు ఇచ్చినట్టు సిధారెడ్డి నిరూపించాలని సవాల్ విసిరిన రమ ణారెడ్డి.. నిరుపించలేకుంటే శిల్పులకు, కళాకారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై ప్రేమతోనే..
ఢిల్లీలో ప్రదర్శనకు తాను బతుకమ్మను రూపొందిస్తే దాని కాంట్రాక్టు బీహారీలకు అమ్ముకున్నారని రమణారెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయినా తెలంగాణపై ఉన్న ప్రేమతో అప్పటి సీఎం కేసీఆర్ పిలుపుమేరకు అమరవీరుల స్మారకం (అమరజ్యోతి) స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం చేపట్టినట్టు స్పష్టంచేశారు.
ప్రపంచంలోనే అతుకులు లేని అమరజ్యోతిని డిజై న్ చేసిన తనకు ఇప్పటికి 40 శాతం బిల్లు పెండింగ్ ఉందని, కాంట్రాక్టర్‌కు మా త్రం 98 శాతం బిల్లు ముట్టిందని ఆరోపించారు. తాను డబ్బుల కోసం పని చేసినట్టు ఎక్కడ కనిపించిందని ప్రశ్నించారు. తెలంగాణ జేఏసీకి లోగో, ఉద్యమానికి పోస్టర్లు, గ్రామజ్యోతి లోగో, సాహిత్య ఆకాడమీకి లోగో ఇలా చాలా చేసినప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.