02-07-2025 01:26:15 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ(Sigachi Factory)లో జరిగిన ఘోర దుర్ఘటన స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(AICC Telangana in-charge Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక శాసనసభ్యులు కృష్ణారావు, రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి పరిశీలించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల బంధువుల సమాచారాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్వయంగా స్వీకరించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా నిలుస్తామని హామీ ఇచ్చి భరోసాను కల్పించారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పూర్తి న్యాయం చేస్తామని వెల్లడించారు. ప్రమాదం స్థలంలో సహాయ చర్యలు పర్యవేక్షించిన మంత్రి రాజనర్సింహ ఈ సందర్భంగా మాట్లాడారు. పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది కార్మికులు మృంతి చెందారు. ఇప్పటికి వరకు 18 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికుల పరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 11 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదని, వారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు.