calender_icon.png 21 July, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌలిగూడ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు

21-07-2025 01:57:38 AM

సమర్పించిన ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): బోనాల ఉత్సవాల్లో భాగంగా గోషామహల్ నియోజకవర్గం గౌలిగూడ మహంకాళి ఆలయ అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆదివారం పట్టు వస్త్రాలను సమర్పించారు.

అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. గోషామహల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, సుభీక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం చైర్మన్ మెట్టు సాయికుమార్‌ను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.