20-10-2025 01:41:06 AM
వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
గుహావటి, అక్టోబర్ 19: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భా రత సంచలనం తన్వి షర్మ రజత పతకం సాధించింది. ఈ టోర్నీ ఆరంభం నుంచీ సంచలన ప్రద ర్శనలతో అదరగొడుతున్న తన్వి ఫైనల్లో పరాజయం పాలైంది. స్వర్ణం కోసం జరిగిన పోరులో థాయ్‌లాండ్‌కు చెందిన అన్యాపత్ చేతిలో 7 12 స్కోర్ తేడాతో ఓడిపోయింది. అయినప్పటకీ 17 ఏళ్ళ తర్వాత ఈ టోర్నీలో మెడల్ గెలిచిన భారత సింగిల్స్ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించింది.
చివరిసారిగా 2008లో సైనానెహ్వాల్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తన్వి భారత్‌కు పతకం కొరత తీర్చింది. ఈ మ్యాచ్ ఆరంభంలో గట్టిపోటీ ఇచ్చినట్టే కనిపించిన తన్వి తర్వాత అనవసర తప్పిదాలతో వెనుకబడింది. 16 ఏళ్ళ తన్వి శర్మ ప్రస్తుతం వరల్డ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా కొనసాగుతోంది.
రజతం గెలిచిన తన్వి వరల్డ్ జూని యర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించిన ఐదో భారత ప్లేయర్‌గా నిలిచింది. గతంలో అపర్ణ పోపట్(1996), సైనా నెహ్వాల్(2006), సిరిల్ వర్మ(2015), ముత్తుస్వామి(2022)లో సిల్వర్ గెలిచారు.