calender_icon.png 20 October, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు ముంగిట బోల్తా

20-10-2025 01:39:48 AM

  1. ఛేజింగ్‌లో పోరాడి ఓడిన భారత్

సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్

ఇండోర్ , అక్టోబర్ 19 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇండోర్ వేదికగా జరిగిన పోరులో భారత్ గెలుపు ముంగిట బోల్తా పడిం ది. ఇంగ్లాండ్ పుంజుకుని 4 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యా టింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 288/8 పరుగు లు చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు.

ప్రతీక రావల్ (6), హ్యార్లిన్ డియోల్(24) త్వరగానే ఔటయ్యా రు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కీలక పార్టనర్‌షిప్ నెలకొల్పారు.  హర్మన్ ప్రీత్(70) రన్స్‌కు ఔటైనా... స్మృతి, దీప్తిశర్మతో కలిసి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్ళింది. అయితే చివర్లో వరుసగా స్మృతి (88), దీప్తి(50) కీలక సమయంలో ఔటవడం విజయావకాశాల ను దెబ్బతీసింది.  ఒక సెమీస్ బెర్త్ కోసం కివీస్, భారత్ మాత్రమే రేసులో ని లిచాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో చివరి సెమీ స్ బెర్త్ ఎవరికనే ది తేలనుంది.