10-01-2026 02:01:40 AM
కౌలాలంపూర్, జనవరి 9 : గత ఏడాది గాయం కారణంగా చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేకపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కొత్త ఏడాదిలో ఫామ్‌తో దూసుకెళుతోంది. ఈ సీజన్ తొలి టోర్నీ మలేషియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైన ల్లో ప్రత్యర్థి యమగుచి గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. ఆమె తప్పుకునే సమయానికి సింధు 21-11 తో తొలి గేమ్ గెలుచి ఆధిక్యం లో నిలిచింది. మరో క్వార్టర్ ఫై నల్లో చైనాకు చెందిన రెండో సీడ్ వాంగ్ జియి 21-17, 21-18 స్కోరుతో ఇండోనేషియా ప్లేయర్ కుసుమా వార్థానిపై విజ యం సాధించింది. శనివారం జరిగే సెమీస్ లో వాంగ్ జియితో సింధు తలపడుతుంది.