calender_icon.png 18 July, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియా పోస్టుల కట్టడికి చర్యలు తీసుకోండి

16-07-2025 12:00:00 AM

కార్టునిస్ట్ హేమంత్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూలై 15: ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై అభ్యంతరకర కార్టూ న్లు వేసిన హేమంత్ మాలవియాకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మంగళవారం ఆదేశించింది. మంగళవారం జస్టిస్ సుదాంశు దులి యా, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన బెంచ్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సో షల్ మీడియాలో అదే రీతిలో కార్టూన్లు పోస్టు చేస్తే మాత్రం ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా సోషల్ మీడియాలో కొందరూ యూ ట్యూబర్లు, స్టాండ ప్ కమెడియన్లు, కళాకారులు ఇష్టారీతిన అ భ్యంతరమైన పోస్టులు చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. ఇలాంటి పోస్టుల కట్టడిచి ఏదో ఒకటి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ప్రధాని మో దీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వేసిన కార్టూన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని వినయ్ మిశ్రా ఫిర్యా దుతో కేసు నమోదైన సంగతి తెలిసిందే.