06-01-2026 04:42:01 PM
మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు
కలెక్టర్ వచ్చి న్యాయం చేస్తేనే ఆందోళన విరమిస్తామన్న నిర్వాసితులు
మంథని,(విజయక్రాంతి): మంత్రి మండలంలోని సిద్దిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇండ్లను అధికారులు కూల్చివేశారని మంథని-పెద్దపల్లి రహదారిపై మంగళవారం నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామంలో నిర్మిస్తున్న అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు థమతీవ్ర ఇబ్బందులు పడుతున్న పడుతున్నారు.