06-01-2026 04:45:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్మల్ పట్టణంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన క్రీడలలో ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు ఆసిఫ్ నితిన్ తేజారావ్ సిబ్బంది పాల్గొన్నారు.