calender_icon.png 26 September, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికుని ఆత్మహత్య

25-09-2025 11:13:33 PM

రామకృష్ణాపూర్,(విజయాక్రాంతి): ఉరి వేసుకుని సింగరేణి కార్మికుడు మృతి చెందిన ఘటన రామకృష్ణాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం పట్టణంలోని జవహర్ నగర్ ఏరియా కు చెందిన రెక్కల గోవర్ధన్ రెడ్డి(42) అనే సింగరేణి కార్మికుడు ఆర్కేపీ సిహెచ్పీ విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మనస్థాపానికి గురైన తను రాత్రి ఇంటిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగు వాళ్ళు గోవర్ధన్ ని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా  అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.