calender_icon.png 8 November, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత

08-11-2025 12:46:34 AM

పాపన్నపేట, నవంబర్ 7 :అక్రమ ఇసుకను రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని పాపన్నపేట ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని ఠాణాకు తరలించారు. మెదక్ వైపు నుంచి పాపన్నపేట వైపుకు ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్ ఇసుక రవాణా చేస్తుందని నమ్మదగిన సమాచారం రావడంతో గురువారం రాత్రి సిబ్బందితో కలిసి వెళ్లి కుర్తివాడ గ్రామ శివారులో టిప్పర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.