calender_icon.png 8 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న సేవలో బీసీ కమిషన్ చైర్మన్

08-11-2025 12:42:50 AM

 కొమరవెల్లి, నవంబర్ 7 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తోపాటు సభ్యులు సుదర్శన్ లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినవారు గర్భగుడిలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనములు ఇచ్చారు. అనంతరం ఆలయ ఈవో టంకశాల వెంకటేష్ స్వామివారి శేష వస్త్రం, చిత్రపటం తో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.