calender_icon.png 8 November, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతినాయకుడు కుంభ!

08-11-2025 12:42:37 AM

బాహుబలి ఫ్రాంఛైజీ, ట్రిపుల్ ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్‌ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఇప్పుడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘వారణాసి’ పేరుతో రానుందని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ వేదికపై చేసిన సందడితో రాజమౌళి ప్రాజెక్టులపై విశ్వవ్యాప్తంగా క్రేజ్ మరో రేంజ్‌లో ఉంది. ఆ స్థాయికి, ఆ ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఇప్పుడు ది గ్లోబ్ ట్రాటర్ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు రాజమౌళి. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ ఈవెంట్ జరగనుంది. అంతకన్నా ముందే ఈ సినిమా నుంచి అప్‌డేట్ల కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు ఓ శుభవార్త అందింది.

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ శుక్రవారం విడుదల చేశారు. ఆయన ఈ సినిమాలో ‘కుంభ’ అనే పాత్రలో నటించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో పృథ్వీరాజ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఏమాత్రం దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారాయన.

హెటైక్ వీల్ చైర్‌లో న్యూ ఏజ్ విలన్‌గా ఫస్ట్ లుక్‌లోనే మెప్పించేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. తాజాగా రాజమౌళి ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ప్రస్తుతం మూవీ యూనిట్ క్లుమైక్స్ సీక్వెన్స్ షూట్ చిత్రీకరిస్తోందని అప్‌డేట్ ఇచ్చారు. సినిమాలో అత్యంత ప్రధానమైన ముగ్గురు పాత్రధారులు షూటింగ్‌లో ఉన్నారని తెలిపారు.