08-11-2025 12:44:59 AM
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మనోహరాబాద్, నవంబర్ 7 : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తుకు అలవాటు పడి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ హి తవు పలికారు. మనోహరాబాద్ మండలంలోని ఐటిసి పారిశ్రామిక కేంద్రంలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. మత్తు పదార్థాలు అమ్మిన కొనుగోలు చేసిన అక్రమ రవాణా చేసిన ఆ వ్యక్తులకు సంబంధించి న సమాచారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాష్, ఐటిసి పరిశ్రమ ప్రతినిధులు ఆనంద్, ప్రసాద్, ఎస్త్స్ర సుభాష్ గౌడ్, ఉద్యోగులు పాల్గొన్నారు.