calender_icon.png 6 December, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

06-12-2025 12:00:00 AM

శంకర్‌పల్లి, డిసెంబర్ 5( విజయక్రాంతి): శంకర్పల్లి మండలంలో అక్రమంగా మధ్య తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులో కి తీసుకోని వారి వద్ద ఉన్న 340 లీటర్ల మద్యం తో పాటు మహీంద్రా జీతో ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంకు చెందిన సురేష్, శేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా శంకర్పల్లి నుంచి మహాలింగాపురం వైపు మద్యం తరలిస్తుండగా   ఆలం ఖాన్ గేట్ సమీపంలో పట్టుబడ్డారు.మహీంద్రా జీతో ఆటోలో  ఉన్న 1656 మద్యం బాటిళ్లు (సుమారు 340 లీటర్ల) ను పోలీసులు సీజ్ చేశారు.