23-05-2025 12:43:40 AM
జిల్లా విద్యుత్ శాఖ సూపర్డెంట్ శ్రావణ్ కుమార్
కామారెడ్డి, మే 22( విజయక్రాంతి), విద్యుత్ శాఖలో హె హెచ్ టి 11 కె.వి,33 కె.వి ఆపై ఓల్టేజ్ సర్వీస్ మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్డి మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 11 కెవి ఓల్టేజ్ గారికాసులను సర్కిల్ ఆఫీస్ ఏడి ఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని తెలిపారు.
33 కెవి ఓల్టేజి, ఆపై ఓల్ ఏజ్ దరఖాస్తులను ఏడి ఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు. ఈ సింగిల్ విండో కొత్త విధానం వల్ల మొదట వినియోగదారులు దరఖాస్తులను వినియోగదారుల హెచ్ టి. 11 కెవి , 33 కెవి ఆ పై వోల్టేజి సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టామని కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు తెలిపారు.
హెచ్ టి. 11 కెవి , 33 కెవి, ఆ పై వోల్టేజి సర్వీసుల మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్ టి మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . ఇందులో భాగంగా 11 కెవి వోల్టేజి దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏ.డి. ఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని, అలాగే 33 కెవి వోల్టేజి, ఆపై వోల్టేజి దరఖాస్తులను ఏ.డి. ఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు.
ఈ సింగిల్ విండో కొత్త విధానం వలన మొదట వినియోగదారులు TGNPDCL పోర్టల్లో అవసరమైన పత్రాలతో HT దరఖాస్తులు( టీజీ ఐపాస్ లో నమోదు కానటువంటివి) నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నంబర్ (UID) ఉత్పన్నమవుతుంది . అలా వచ్చిన కొత్త దరఖాస్తులు TGNPDCL యొక్క సంబంధిత సర్కిల్లలో డాష్ బోర్డులో కనిపిస్తుంది. ప్రతిరోజూ ADE/కమర్షియల్లు అధికారులు డాష్ బోర్డుని మానిటర్ చేస్తూ ఉంటారు.
దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత 11కెవి , 33 కెవి ఆ పై వోల్టేజి దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపించబడుతుందని , ADE/కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్ స్టాఫ్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్ను సందర్శిస్తారు. 33 కెవి ఆ పై వోల్టేజి ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతులు ఇస్తారు.
ఇక 33KV ఆ పై వోల్టేజి దరఖాస్తులు అయితే, ఆన్లైన్లో సంబంధిత CE/కమర్షియల్ & RAC/TGTRANSCO కి ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుంద న్నారు. 11కెవి వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి ఫీజిబిలిటీ ఉంటె రెండు రోజుల్లో అప్లోడ్ చేయబడుతుంది. వివిధ కారణాల వల్ల సాధ్యపడకపోతే, 2 రోజులలోపు రిమార్క్లు వినియోగదారునికి SMS రూపేణా పంపబడుతుంది.
అలాగే 33 కెవి, ఆపై వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి వాటికీ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు పొందుపరచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సింగిల్ విండో వ్యవస్థ వలన త్వరిత గతిన సర్వీసులు మంజూరు అవుతాయని, ప్రతి సారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు.
దీని వలన అత్యంత పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులు దరఖాస్తుల స్థితి గతులను ఎప్పటి కప్పుడు SMS రూపేణా సమాచారం పంపబడుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్ వివరించారు .