calender_icon.png 26 August, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టును పక్కనపెట్టారు: మంత్రి ఉత్తమ్

13-08-2024 06:34:38 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పతిపక్ష పార్టీలు పనిగా పెట్టుకున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు చేపట్టారు. కానీ, బీఆర్ఎస్ గత పదేళ్లు అధికారంలో ఉండి కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టును పక్కనపెట్టారని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని ప్రాజెక్టు పేర్లు మార్చి రీడిజైన్ చేసి ఖర్చు నాలుగింతలు చేశారన్నారు.

రెండు ప్రాజెక్టులను రూ.3,505 కోట్లతో పూర్తి చేయవచ్చు. కానీ, గత ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.18,286 కోట్లకు పెంచింది. కాళేశ్వరం మాదిరిగానే రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల వ్యయాన్ని నాలుగింతలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని కొంత భూభాగం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లింది. రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు వ్యయం రూ.19 వేల కోట్లకు చేరిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు సీతారామ్ ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేశామనడం హాస్యాస్పదమన్నారు.