28-08-2025 10:08:32 PM
ఆర్డీవో రాధాబాయి సిఈ మధుసూదన్, మండల అధికారులు
బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశమును గురువారం వేములవాడ ఆర్డిఓ రాధాబాయి(Dr. RDO Radhabai), నీటిపారుదల శాఖ సిఈ మధుసూదన్, మండల స్థాయి అధికారులు పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయంకు వరద నీరు పోటెత్తింది. దీంతో జలాశయంకు భారీగా వరద నీరు లాగా జలాశయం ఇంజనీరింగ్ అధికారులు 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టును పరిశీలించారు. దిగువన ఉన్న మానవాడ మల్లాపూర్ గ్రామాల రైతులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వెంట ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు, ఇన్చార్జి ఎమ్మార్వో నిమ్మ భూపేష్ రెడ్డి, ఎంపీడీవో భీమా జయశీల, కార్యదర్శి ఉన్నారు.