calender_icon.png 29 August, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసి 8 గేట్లు ఎత్తివేత

28-08-2025 09:39:32 PM

దిగువకు 10.294.88 క్యూసెక్కుల నీరు విడుదల

నకిరేకల్ (విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయినా మూసి ప్రాజెక్టు(Musi Project)కు వర్షాలు కురవడంతో పైనుండి 8857.94 క్యూసెక్కుల వర నీరు మూసి ప్రాజెక్టుకు వస్తుండడంతో ప్రాజెక్టు నిండుకుండలాగా మారింది. ప్రాజెక్టు 645 లెవెల్ గాను 643.45 ఉండడంతో గురువారం అధికారులు ఎనిమిది గేట్లను రెండు ఫీట్లమీర ఎత్తి దిగువకు 10.294.88 క్యూసెక్కుల నీటిని, రైట్ కెనాల్ లిఫ్ట్ కెనాల్ ద్వారా 239.85. క్యూసెక్కుల నీటిని మొత్తం 10.594.95 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. క్రింది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.