calender_icon.png 29 August, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సై విజయ్ కొండ సేవలు అభినందనీయం

28-08-2025 10:10:03 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మద్నూర్ మండలంలోని డోంగ్లి మండలంలోని సిర్పూర్ గ్రామానికి వరద ముంపు పొంచి ఉందని అధికారులు గుర్తించారు. ఆ గ్రామానికి చెందిన పలువురిని మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రానికి తరలించారు. అందులో భాగంగా ఎస్సై విజయ్ కొండ(SI Vijay Konda) సిర్పూర్ గ్రామ వృద్ధురాలిని చేతుల మీద ఎత్తుకొని తీసుకువస్తున్న దృశ్యాన్ని చూసి మండల ప్రజలు ఎస్సై సేవలకు అభినందిస్తున్నారు. మీ సేవలు అభినందనీయమని   పేర్కొంటున్నారు.