calender_icon.png 29 August, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలి

28-08-2025 10:03:29 PM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల: మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనుల్లో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ  కాన్ఫరెన్స్ హాల్ నందు గద్వాల్ మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇల్లు మంజూరు అయిన ప్రతి ఒక్కరూ నిర్మాణం చేపట్టేలా అవసరమైన తోడ్పాటును అందించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు మార్క్‌అవుట్ నుంచి బేస్‌మెంట్ వరకు ప్రతి దశను వేగవంతంగా, నాణ్యంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం అవసరమైన ఇసుక, మట్టి వంటి నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారులకు కనిష్ట ధరలకు అందజేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, మట్టిని లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వార్డ్ అధికారులకు ఆదేశించారు. లబ్దిదారుల వివరాలను త్వరితగతిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్ నందు ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గద్వాల్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్, వార్డ్ ఆఫీసర్స్, తదితరులు పాల్గొన్నారు.