28-08-2025 10:12:01 PM
- రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- అందుబాటులో 1035.035 మెట్రిక్ టన్నుల యూరియా
- జిల్లా వ్యవసాయ అధికారి భుక్యా ఛత్రు నాయక్
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ సాగుకు సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భుక్యా ఛత్రు నాయక్(District Agriculture Officer Bhukya Chatru Nayak) గురువారం తెలిపారు. జిల్లాలో 1035.035 మెట్రిక్ టన్నుల యూరియా, 742.2 మెట్రిక్ టన్నుల డి.ఎ.పి., 772.25 మెట్రిక్ టన్నుల ఎం.ఓ.పి., 4066.025 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, ఎస్.ఎస్.పి. 414 మెట్రిక్ టన్నులు ఇలా 7029.51 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాలలో...
జిల్లాలోని 18 మండలాల్లోని హోల్ సేల్, రిటైల్ దుకాణాలతో పాటు మార్క్ ఫెడ్ బఫర్ లో జిల్లాకు అవసరమైన నిలువలున్నాయని డీఏఓ ఛత్రూ నాయక్ వెల్లడించారు. జిల్లాలోని రిటైలర్ ల వద్ద 5332.325 ( యూరియా 391.35, డి.ఎ.పి. 567.85, ఎం.ఓ.పి. 382.55, కాంప్లెక్స్ 3625.075, ఎస్.ఎస్.పి. 365.5 ) మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే హోల్ సేల్ డీలర్ల వద్ద 849.49 (యూరియా 12.69, డి.ఎ.పి. 50, ఎం.ఓ.పి. 389. 7, కాంప్లెక్స్ 347.6, ఎస్.ఎస్.పి. 48.5 ) మెట్రిక్ టన్నులు, మార్కెఫెడ్ బఫర్ లో 548.695 (యూరియా 330. 995, డి.ఎ.పి. 124.35, కాంప్లెక్స్ 93.35 ) మెట్రిక్ టన్నులు, కమీషనర్ రిజర్వ్ పూల్ లో 300 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.
ఫర్టిలైజర్ దుకాణాలలో ఎరువుల నిలువలు ఇలా...
- బెల్లంపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి మండలంలో 258.37 (యూరియా 17.32, డి.ఎ.పి. 34.25, ఎం.ఓ.పి. 1.65, కాంప్లెక్స్ 174.3, ఎస్.ఎస్.పి. 30.85 ) మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కాసిపేట మండలంలో 160.845 (యూరియా 10.845, డి.ఎ.పి. 30.75, ఎం.ఓ.పి. 0.55, కాంప్లెక్స్ 116.7, ఎస్.ఎస్.పి. రెండు) మెట్రిక్ టన్నులు, తాండూర్ మండలంలో 330.685 ( యూరియా 1.035, డి.ఎ.పి. 49.2, ఎం.ఓ.పి. 2.75, కాంప్లెక్స్ 264, ఎస్.ఎస్.పి. 13.7) మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
- చెన్నూరు వ్యవసాయ డివిజన్ పరిధిలోని భీమారం మండలంలో 206.825 ( యూరియా 33.525, డి.ఎ.పి. 31.05, ఎం.ఓ.పి. 18.75, కాంప్లెక్స్ 110.85, ఎస్.ఎస్.పి. 12.6 ) మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అలాగే చెన్నూర్ మండలంలో 1051.32 (యూరియా 41.92, డి.ఎ.పి. 148.8, ఎం.ఓ.పి. 62.7, కాంప్లెక్స్ 710.15, ఎస్.ఎస్.పి. 87.75) మెట్రిక్ టన్నులు, జైపూర్ మండలంలో 406.125 (యూరియా 3.7, డి.ఎ.పి. 54.65, ఎం.ఓ.పి. 80.65, కాంప్లెక్స్ 227.325, ఎస్.ఎస్.పి. 39.8) మెట్రిక్ టన్నులు, మందమర్రి మండలంలో 135.595 (యూరియా 9.945, డి.ఎ.పి. 13.6, ఎం.ఓ.పి. 10.15, కాంప్లెక్స్ 94.75, ఎస్.ఎస్.పి. 7.15) మెట్రిక్ టన్నులు, కోటపల్లి మండలంలో 226.58 (యూరియా 12.78, డి.ఎ.పి. 24.9, ఎం.ఓ.పి. 14.9, కాంప్లెక్స్ 174) మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
- భీమిని వ్యవసాయ డివిజన్ పరిధిలోని కన్నెపల్లి మండలంలో 290.885 (యూరియా 0.135, డి.ఎ.పి. 8.4, ఎం.ఓ.పి. 6.9, కాంప్లెక్స్ 274.95, ఎస్.ఎస్.పి. 0.5) మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అలాగే వేమనపల్లి మండలంలో 177.76 ( యూరియా 17.46, డి.ఎ.పి. 30.25, ఎం.ఓ.పి. 8.1, కాంప్లెక్స్ 121.95) మెట్రిక్ టన్నులు, నెన్నెల మండలంలో 354.075 (యూరియా 13.275, డి.ఎ.పి. 36.15, ఎం.ఓ.పి. 13.55, కాంప్లెక్స్ 286.1, ఎస్.ఎస్.పి. ఐదు) మెట్రిక్ టన్నులు, భీమిని మండలంలో 84.785 (యూరియా 10.935, ఎం.ఓ.పి. మెట్రిక్ టన్ను, కాంప్లెక్స్ 72.85) మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
- మంచిర్యాల వ్యవసాయ డివిజన్ పరిధిలోని దండేపల్లి మండలంలో 444.985 (యూరియా 42.435, డి.ఎ.పి. 33.55, ఎం.ఓ.పి. 58.2, కాంప్లెక్స్ 275.4, ఎస్.ఎస్.పి. 35.4)
మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని. అలాగే హాజీపూర్ మండలంలో 188.67 (యూరియా 20.295, డి.ఎ.పి. 10.05, ఎం.ఓ.పి. 30.45, కాంప్లెక్స్ 115.375, ఎస్.ఎస్.పి. 12.5) మెట్రిక్ టన్నులు, జన్నారం మండలంలో 213.755 (యూరియా 42.55, డి.ఎ.పి. 26, ఎం.ఓ.పి. 10.8, కాంప్లెక్స్ 101.4, ఎస్.ఎస్.పి. 33.3) మెట్రిక్ టన్నులు, లక్షెట్టిపేట మండలంలో 590.945 (యూరియా 53.82, డి.ఎ.పి. 11.3, ఎం.ఓ.పి. 47.3, కాంప్లెక్స్ 409.125, ఎస్.ఎస్.పి. 71.4) మెట్రిక్ టన్నులు, మంచిర్యాల మండలంలో 173.725 ( యూరియా 44.325, డి.ఎ.పి. 20.65, ఎం.ఓ.పి. 12, కాంప్లెక్స్ 89.65, ఎస్.ఎస్.పి. 7.1) మెట్రిక్ టన్నులు, నస్పూర్ మండలంలో 34.395 ( యూరియా 15.345, డి.ఎ.పి. 4.3, ఎం.ఓ.పి. 2.15, కాంప్లెక్స్ 6.2, ఎస్.ఎస్.పి. 6.4) మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.