calender_icon.png 29 August, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షెడ్యూల్డ్ ప్రాంతాల సర్వేర్లు వల్లనే 1/70 చట్టానికి తూట్లు...

28-08-2025 09:39:04 PM

ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్..

వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): షెడ్యూల్ ప్రాంతాల సర్వేయర్ల వల్లనే వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి తూట్లు పడుతున్నాయని ఆదివాసి సంక్షేమ పరిషత్(Tribal Welfare Council) ములుగు జిల్లా కార్యదర్శి పర్షిక సతీష్ ఆరోపించారు. గురువారం వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మండల తహశిల్దార్ కి షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాలను పరిరక్షించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244(1) ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాల ద్వారా ఆదివాసులకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులు ఉన్నాయని, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఆదివాసులు సాగులో ఉన్న భూములకు పట్టాలు గూర్చి రెవెన్యూ అధికారులు అడుగుతే అసైన్మెంట్ అని కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏజెన్సీ ప్రాంతంలో వలస గిరిజనేతరులకు ధరణి పేరుతో ప్రభుత్వ భూములు  వెంకటాపురం మండలంలో అంకన్నగూడెం(జడ్), వీరభద్రవరం(జడ్) సూరవీడు(జి)(జెడ్)చిన్నడ (జడ్),  వెంకటాపురం(జడ్)నూగురు (జి),మరికాల(జడ్) బోదాపురం(జడ్)(జి),ప్రభుత్వ భూములు అక్రమ పట్టాలకు సర్వేర్లుల ద్వారానే ఆద్యం పోశారని మండిపడ్డారు. షెడ్యూల్డ్ ప్రాంతాల1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములు సర్వేర్లు తప్పుడు రిపోర్టుల ప్రకారం అక్రమ పట్టా పాస్ పుస్తకాలు గిరిజనేతరులు పొందారన్నారు. భూభారతి (ఆర్.ఓ.ఆర్)చట్టం-2025లో షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాలకు విరుద్ధంగా 1970 సంవత్సరం తర్వాత గిరిజనేతరులకు వచ్చిన అక్రమ పట్టా పాస్ పుస్తకాలు, సర్వేయర్లల రిపోర్టులపై సమగ్ర విచారణ జరిపి ఎల్.టీ.ఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, కార్యదర్శి కుర్శం శంకర్, బొగ్గుల రాజ్ కుమార్, తాటి నాగరాజ్, పూనెం అర్జున్, సోడి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.