28-08-2025 10:14:04 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు ఆత్మీయుల బాధిత కుటుంబ సభ్యులను గురువారం మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి(Former DCCB Chairman Pocharam Bhaskar Reddy) పరామర్శించారు. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మండల నాయకులు దుంపల రాజు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన రాజులు ఆయన పరామర్శించారు.
అదేవిధంగా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ పాత్రికేయుడు గంగరాజు గౌడ్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన గంగారాజు గౌడ్ ను పరామర్శించారు. అదేవిధంగా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ సందీప్ సోదరుడు, బాన్సువాడ పట్టణ మున్సిపల్ ఉద్యోగి ప్రదీప్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం మరణించారు, ఈరోజు వారి ఇంటికి వెళ్లి సందీప్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. ఆయన వెంట బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.