calender_icon.png 25 December, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యాయత్నం కేసులో ఆరుగురు రిమాండ్

25-12-2025 01:45:42 AM

తాండూరు, డిసెంబర్ 24(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలో ఈ నెల 18వ తేదీన సర్పంచ్ జంగం బసమ్మ భర్త రుమల్ల సంగయ్య స్వామి పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ధరూరు సీఐ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రత్యర్థులు  ఓటమిని జీర్ణించుకోలేక పక్కా పథకం ప్రకారం కోటిపల్లి  గ్రామానికి చెందిన 1,మొహమ్మద్ షాకీర్, 2, ఆనం శివకుమార్ ,3 మొహమ్మద్ అక్రమ్, 4  అస్మత్ ఖురేషి, 5 మహమ్మద్ షా నవాజ్ 6 నక్కల బందయ్య కలిసి దాడి చేశారు.

పథకం ప్రకారం  రాత్రి 10 గంటల 40 నిమిషాలకు దాడికి పాల్పడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. సర్పంచ్ బసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నామన్నారు .ఆరుగురు నిందితులపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని..శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు  తీసుకుంటామని ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.