calender_icon.png 25 December, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిసారిగా ఎక్సైజ్ సీఐ, ఎస్సైల కమిటీ ఎన్నిక

25-12-2025 01:54:40 AM

అధ్యక్షుడిగా సూర కృష్ణయ్య

సికింద్రాబాద్/కంటోన్మెంట్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐలు, ఎస్సైల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు హైదరాబా ద్లోని రైల్వే ఆఫీసర్ల క్లబ్లో జరిగాయి. తొలిసారిగా ఏర్పడిన ఈ సంఘానికి తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీపీఈ ఈఓసీఏ)గా ఏర్పాటైంది. ఈ సంఘంలో తెలంగాణ ఎక్సైజ్శాఖలోని 762 మంది సీఐలు,ఎస్సైలు సభ్యులుగా ఉన్నారు. ఎక్సైజ్ శాఖలో ఎక్సైజ్ గెజిటెడ్ అఫిసర్ల సంఘం, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ సంఘాలుఉన్నాయి.

ఫీల్డ్లో పని చేసే సీఐలు, ఎస్సైల సంఘం లేక పోవడంతో ఈ సంఘం ఎన్నికలు నిర్వహించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీజీపీఈఈఓసీఏ అధ్యక్షుడిగా సీఐ సూర కృష్ణయ్య,ప్రధాన కార్యదర్శిగా ఎస్సై కే. చిరంజీవి,కోశాధికారిగా డి.భాస్కర్ రావులు ఎన్నికయ్యారు.వీరిలోపాటు ముగ్గురు అసోసియే ట్ అధ్యక్షులు, ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శలు, ఇద్దరు జోనల్ కార్యదర్శలు, అరుగురు సభ్యులుగా ఎంపికయ్యారు.

ఈ ఎన్నికలను ఎన్నికల అధికారులు ఎంపిఆర్ చంద్రశేఖర్, జిన్నా నాగార్జున రెడ్డి, సహాయక ఎన్నికల అధికారిగా మంగు శ్రవణ్, పరిశీలకులుగా మధు బాబు, రామకృష్ణ, శ్రీనివాసరావులు వ్యవహించారు. కొత్తగా టీజీపీఈఈఓసీఏ సం ఘానికి ఎన్నికైన కార్యవర్గం తోపాటు సీఐలు, ఎస్సైలు కలిసి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెకట్రరీ రఘునందన్రావు, ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్, అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషిలను మర్యాద పూర్వకంగా కలిశారు.