calender_icon.png 10 May, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా ప్రజావాణికి 63 ఫిర్యాదులు

25-03-2025 12:03:54 AM

ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురి వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24(విజయక్రాంతి) : ప్రజావసరాలకు ఉద్దేశించిన భూమిని స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కబ్జా చేసేస్తున్నారని, ఆ భూములను కాపాడాలని పలువురు హైడ్రా ప్రజా వాణికి ఫిర్యాదు చేశారు.  సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 63 ఫిర్యా దులు వచ్చాయి. చెరువుల్లో వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే పరిమితమవ్వాల్సిన శిఖం భూములలో పక్కన గల పట్టా భూమి సర్వే నంబరు చూపించి అనుమతులు తీసుకుని ఇళ్లు కడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో తాము వ్యవసాయ భూమిని కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం, ఇంజాపూర్ గ్రామంలో పాఠశాలకు ఆనుకుని ఉన్న 14 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధి కబ్జా చేస్తున్నాడని ప్రజావాణికి స్థానికులు ఫిర్యాదు చేశారు. 

మియాపూర్ - బీహెచ్ ఈ ఎల్ ప్రధాన రహదారిలో ఉన్న గంగారాం చెరువు ఎఫ్టీఎల్ ఎగువున తమ ఇంటి స్థలాలున్నా.. నిర్మాణానికి అనుమతులివ్వడంలేదని పలువురు వాపోయారు.  మేడ్చెల్ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలం, నాగారం మున్సిపాలిటీలోని అన్నరాయ చెరువులో తనకున్న ఎకరం శిఖం భూమిని పక్కనే లే ఔట్ వేసిన వ్యక్తి ఆక్రమించి దానిని కూడా ప్లాట్ల మాదిరి అమ్మేస్తున్నారని అన్నం రాజు హరిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మేడ్చల్ - జిల్లాలోని మేడిపల్లి గ్రామంలోని ఊరచెరువుకు ఉన్న పాత నాలాను పునరుద్ధరించాలని పలువురు ప్రజావాణి ఫిర్యాదులో కోరారు.