13-07-2025 01:23:51 AM
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్‌ఎంఎస్)కు చెందిన శ్రీవాస్తవ1988 బ్యాచ్ ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఆర్‌ఎస్‌ఈ)కి చెందిన అధికారి. గతంలో ఆయన సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జనరల్ మేనే జర్‌గా పనిచేశారు. సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన వివిధ సాంకేతిక పురోగతులు, విధానాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆర్.డి. ఎస్.ఓ, ఆర్.ఐ.టి.ఈ.ఎస్, రైల్వే బోర్డులో పలు కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. రైల్వే మౌలిక సదుపాయాలు, మెట్రో ప్రాజెక్టులు, అధునా తన రైలు సాంకేతికతల అభివృద్ధిలో కీలకపాత్ర వహించారు. ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన శ్రీవాస్తవ.. అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవి ద్యాలయం నుండి ఎంబీఏ పట్టాను పొందారు. బికనీర్‌లో డివిజనల్ రైల్వే మేనేజర్‌గా రైల్వేలో కెరీర్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి జీఎంగా బాధ్యతలు స్వీకరించారు.