calender_icon.png 13 July, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారికి శ్రీమద్భగవద్గీత తిరుమల సమర్పణ

13-07-2025 01:22:47 AM

స్వరపరిచి, గానం చేసిన గజల్ శ్రీనివాస్ 

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): డాక్టర్ గజల్ శ్రీనివాస్ స్వరపరచి, గానం చేసిన శ్రీమద్భగవద్గీతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ కృష్ణ మోహన్ చేతుల మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు భానుప్రకాష్‌కు తిరుపతి కచ్చపి కళాక్షేత్రంలో శనివారం అందజేశారు.

గజల్ శ్రీనివాస్ ఎంతో భక్తితో గానం చేసిన గీతను తిరుమల తిరుపతి దేవస్థానం సంపూర్ణంగా వినియోగించుకోవా లని జస్టిస్ బీ కృష్ణమోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకులు రాఘవులు, రాష్ట్ర హస్త కళల చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టిటిడి పూర్వ అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, స్విమ్స్ డైరక్టర్ డాక్టర్ ఆర్‌వి కుమార్, ఆకెళ్ళ విభీషణ శర్మ, ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి సురేంద్రనాయుడు పాల్గొన్నారు.