24-07-2024 12:24:50 AM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో/మెదక్/చేగుంట/కొండపాక, జూలై 23(విజయక్రాంతి): దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులను ఆల్ ఇండియా సర్వీసుల్లో ఎలా తీసుకుంటారని ఆమె చేసిన వ్యాఖ్యలు వారి ఆత్మ స్థుర్యైన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మంద కృష్ణ మండిపడ్డారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి బుద్ధి బలం, జ్ఞాన బలంతో అద్భుతమైన విజయాలు సా ధించిన వారు ఉన్నారని గుర్తు చేశారు.
ఉన్నతాధికారి అయిన స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేయడం సరికాదని ఆయన మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా స్మితా సబర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసు కోవాలని డిమాం డ్ చేశారు. దివ్యాంగులు ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి సైతం రావచ్చని సుప్రీంకోర్టు చెప్పి న విషయాన్ని మ ర్చిపోవడం కోర్టు ధిక్కార నేరం అవుతుందన్నారు. ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్‌పై ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, మెదక్ జిల్లా దివ్యాంగుల సంఘాల జేఏసీ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు మీర్ గియాజుద్దీన్ డిమాండ్ చేశారు. సిద్దిపేట సీపీ అనురాధకు దివ్యాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జింక యాదగిరి ఫిర్యాదు చేశారు.