calender_icon.png 22 November, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మృతి-పలాష్ ముచ్చల్ ఎంగేజ్‌మెంట్

22-11-2025 12:45:57 AM

-డీవై పాటిల్ స్టేడియంలో ప్రపోజల్

-మోదీతో సహా ప్రముఖుల విషెస్

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ పలాష్ ముచ్చల్ తో ఆమె ఎంగేజ్‌మెంట్ వినూత్నంగా జరిగిం ది. వరల్ కప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియం లో పలాష్ ముచ్చల్ ఆమెకు ప్రపోజ్ చేశా డు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. స్మృతి కళ్లకు గంతలు కట్టిన పలాష్ ఆమెను స్టేడియం మధ్యలోకి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చుని రింగ్ ఇస్తూ ప్రపోజ్ చేశాడు.

ఈ సర్ ప్రైజ్ నుంచి వెంటనే తేరుకున్న స్మృతి ఓకే చెప్పడం, ఇద్దరూ రింగ్స్ మార్చుకోవ డం జరిగాయి. ఈ భావోద్వేగ క్షణాలను వీడి యో రూపంలో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు ఈ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మోదీ కూడా క్రికెట్ భాషలోనే ఆమె కు విషెస్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్మృతి మంధాన అద్భుతమైన కవర్ డ్రైవ్ను ప్రస్తావిస్తూ మోదీ శుభా కాంక్షలు చెప్పడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

మ్యూజిక్ కంపోజర్ కమ్ సింగర్ అయిన సింగర్ పలాష్ ముచ్చ ల్తో స్మృతి ఎప్పటి నుంచో ప్రేమలో ఉంద న్న వార్తలో గతంలోనే వచ్చాయి. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో ఆ వార్తలన్నీ నిజమయ్యాయి. ఇరువురి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 23న వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరు కానున్నారు.

ఇదిలా ఉంటే తన ఎంగేజ్ మెంట్ విషయాన్ని ధృవీకరిస్తూ స్మృతి మంధాన కూడా తన ఇన్ స్టా గ్రామ్ లో సహచర క్రికెటర్లతో రీల్ చేసి అభిమానులతో పంచు కుంది. గత కొన్నేళ్ళుగా భారత మహిళల జట్టు కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న స్మృతి మంధాన ఇటీవల ప్రపంచకప్‌లో నూ పరుగుల వరద పారించింది. అటు 29 ఏళ్ల పలాష్ ముచ్చల్ మ్యూజిక్ కంపోజర్, ఫిల్మ్ మేకర్‌గా రాణిస్తున్నాడు. అతని సోద రి పాలక్ ముచ్చల్ బాలీవుడ్ గాయని. పలా శ్  టీ సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీలకు పలు మ్యూజిక్ వీడియోలు చేసాడు.