calender_icon.png 22 November, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ విద్యార్థుల సత్తా

22-11-2025 12:48:09 AM

-అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

-సీఎంను కలిసిన వారిలో మంత్రి లక్ష్మణ్‌కుమార్, ఉన్నతాధికారులు తదితరులు

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : నాల్గవ ఈఎంఆర్‌ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్  తెలంగాణ రికార్ ్డ-బ్రేకింగ్ మెడల్స్  సాధించింది. ఈ మీట్‌లో ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను సాధించిన తెలంగాణ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు, విద్యార్థులు కలిశారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాలకంటే అత్యధికంగా 230 పతకాలను తెలంగాణ సాధించింది.

నవంబర్ 15, 2025న ఒడిశాలో జరిగిన 4వ ఈఎంఆర్‌ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్- 2025 పోటీల్లో పాల్గొన్న తెలంగాణలోని 23 ఈఎంఆర్ సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ జాతీయ క్రీడా పోటీల్లో 22 రాష్ట్రాల్లోని 499 ఈఎంఆర్ సంస్థలకు చెందిన 5,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 22 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా ఇందులో వ్యక్తిగత ఈవెంట్లు 15, జట్టు ఈవెంట్లు -07 తెలంగాణ తరపున హాజరయ్యాయి. ఈ జాతీయ ఈవెంట్‌లో పాల్గొన్న 23 పాఠశాలలకు చెందిన 580 మంది విద్యార్థులు. వ్యక్తిగత, జట్టు ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శనను తెలంగాణ విద్యార్థులు  ప్రదర్శించారు. మొత్తం 714 పాయింట్లతో అద్భుతమైన ఛాంపియన్‌షిప్‌ను తెలంగాణ కైవసం చేసుకుంది.