22-11-2025 12:44:28 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నో యిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫై నల్స్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన డీఎస్పీ, స్టార్ బాక్సర్ నిఖత్ జరీ న్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంపై డీజీపీ శివధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె ను అభినందించారు. గోల్డ్ మెడల్ సాధిం చి, తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిఖత్ జరీన్ నిలిచిందన్నారు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజ యం, పోలీసు శాఖలోని ఇతర క్రీడాకారులకు, యువతకు గొప్ప ఆదర్శమన్నారు. నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి, రాష్ట్రానికి మరిన్ని విజయాలు అందించాలన్నారు.