06-01-2026 12:00:00 AM
పటాన్ చెరు, జనవరి 5 : పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆధర్శ్ రెడ్డి అయ్యప్ప స్వామి మాలధారణ చేసి, ఇరుముడి పూజ అనంతరం అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు బయలుదేరిన సందర్భంగా, సోమవారం ఉదయం బీహెచ్‌ఈఎల్ టౌన్షిప్లోని అయ్యప్ప స్వామి ఆలయం లో ఇరుముడి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, కార్యక్రమం భక్తి భావాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది. కుటుంబ సభ్యులతో పాటు మాజీ ప్రొటెమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఆర్సీపురం మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య,బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్,జగన్నాథ్ రెడ్డి,సోషల్ మీడియా ఇన్చార్జి రవి కిరణ్,
మాజీ కౌన్సిలర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి , బీఆర్‌ఎస్వీ కోఆర్డినేటర్ చిన్న , యువ నాయకులు సాయి చరణ్ గౌడ్, మాణిక్ యాదవ్, సాయి చందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి గమ, సుధాకర్, జకీర్, నరేష్, జానీ, దిలీప్ సింగ్, ప్రవీణ్ , వేను, ఎల్‌ఐజీ కాలనీ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.