12-06-2025 01:36:41 AM
పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య
నల్లగొండ టౌన్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని గత 25 ఏండ్లనుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా, ఏ పని అప్పజెప్పినా నిబద్దతో పనిచేశానని పీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు.
ప్రతిపక్షంలో ఉండి పేదల సమస్యల పరిష్కారానికి ఎన్నో పొరాటాలు చేశామని ప్రభుత్వంలో లబ్ధిచేకూరని ఎన్నో పథకాలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అమలుచేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, తెలంగాణ ప్రజా ప్రభుత్వంలోనూ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ప్రకారం పెద్దపీట వేస్తూ ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కా ర్పొరేషన్ పదవులు, మంత్రి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించిందన్నారు.
తాజాగా జరిగిన పీసీసీ కార్యకవర్గంలోనూ సామాజిక న్యాయమే ఎజెండాగా పార్టీ కోసం కష్టప నాయకులకు చోటు కల్పించడం హర్షిస్తున్నానని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఓసీలకు పార్టీ రాష్ట్ర పదవుల్లో చోటు కల్పించడం ఇందుకు గర్వకా రణమైన విషయం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండలాల నాయకులు పాల్గొన్నారు.