calender_icon.png 8 July, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన బీసీ కమిషన్ విచారణ

12-06-2025 01:35:16 AM

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ర్ట ఏర్పాటు తర్వాత బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చుకోవాలని వచ్చిన విజ్ఞప్తులపై బీసీ కమిషన్ నిర్వహిస్తున్న బహిరంగ విచారణ బుధవారం ముగిసింది.  చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు విచారణలో పాల్గొన్నారు.

64 ప్రతినిధుల బృందాలను కమిషన్ విచారించిందని, మూడు రోజుల విచారణలో 133 బృందాలను కమిషన్ విచారణ చేసిందని తెలిపారు. పొందర, శెట్టిబలిజ, కొప్పుల వెలమ, తదితన కులాలకు చెందిన ప్రతినిధులు కమిషన్ ముందు హాజరై తమ కులాలను బీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారన్నారు. మరో వైపు బీసీx గ్రూపునకు చెందిన ప్రతినిధులు తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.