calender_icon.png 5 August, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి

05-08-2025 07:18:36 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెప్పన మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం జరిగిందని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, ఏఎన్ఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో విద్యార్థులకు మినరల్ వాటర్ అందించడం లేదని పౌష్టికాహారం అందించడంలోనూ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలల పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు.