05-08-2025 07:15:33 PM
ఈ నెల 15న కోదాడ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
కోదాడ: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాల పై హైద్రాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ఇరిగేషన్,పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఎత్తిపోతల పథకాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
కోదాడ బస్ స్టాండ్ ని ఆధునికరణ బస్ స్టాండ్ గా నిర్మించుటకి 16.89 కోట్లు, హుజూర్ నగర్ నందు బస్ స్టాండ్ కొరకు 3.52 కోట్లతో మంజూరు చేశామని, పంద్రాగస్ట్ రోజు కోదాడ, హుజూర్ నగర్ ఆధునికరణ బస్ స్టాండ్లకి శంకుస్థాపన చేస్తామని అధికారులు ఏర్పాటు చేయాలని, 6 నెలల లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందిస్తూ, పార్కింగ్, కాంటీన్, ఏసీ వెయిటింగ్ హల్, పిడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకి ఆదేశించారు. అధికారులు పాల్గొన్నారు.