calender_icon.png 25 May, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టం రుణం తీర్చుకుంటది

24-05-2025 10:58:10 PM

మీ ప్రేమాభిమానం ఎప్పటికీ మర్చిపోను..

ఆర్టీఐ కమీషనర్ పివి శ్రీనివాస్..

ఖమ్మం (విజయక్రాంతి): విద్యార్థి దశ నుండి అనేక ప్రగతిశీల ఉద్యమాలు, జీవితంలో ఆటుపోట్లు, తెలంగాణ ఉద్యమంలో ఒక జర్నలిస్టుగా పడ్డ కష్టం నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. కష్టం ఎప్పటికైనా రుణం తీర్చుకుంటదని సమాచార హక్కు చట్టం కమిషనర్ పివి శ్రీనివాస్ తన జీవిత ఆటుపోటులను గుర్తు తెచ్చుకుని భావోద్వేగంతో ప్రసంగించారు.  శనివారం ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాల్లో సమాచార హక్కు చట్టం కమీషనర్ గా నియమితులైన, సీనియర్ జర్నలిస్ట్ పివి శ్రీనివాస్ సన్మాన కార్యక్రమం  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పివి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వాహకులుగా డాక్టర్ జివి, బిచ్చాల తిరుమలరావు, ఆకుతోట ఆదినారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మిత్ర బృందం ఏర్పాటుచేసిన అభినందన సభలో పివి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను జీవితంలో పడ్డ కష్టానికి నాకు వచ్చిన ఈ పదవితో స్నేహితుల సన్మానం గర్వకారణం. కానీ నాతో భౌతికంగా విడిపోయిన వ్యక్తులు ఈరోజు ఉండుంటే నాకంటే ఎక్కువ సంతోష పడేవారు. అందులో ముఖ్యులు నూకల నరేష్ రెడ్డి, మా అమ్మ , అదేవిధంగా బుడాన్ బేగ్ ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురై కంటనీరు పెట్టారు. అభిమానం పొందుటంలో ఉన్న తృప్తి ఏ పదవితోకానీ, డబ్బుతో కానీ వెలకట్టలేనిదన్నారు. కొంతమంది మనల్ని ఉపయోగించుకుంటారు విస్మరిస్తారు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడ్డ వారికి ఫలితం ఉంటుందన్నారు.

పీవీ శ్రీనివాస్ సహచరిణి సృజన మాట్లాడుతూ.. ఉద్యమం ద్వారా జీవితంలో పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఖమ్మం ఆడబిడ్డని అంటూ ప్రతి ఒక్కరిని పేరుతో పలకరించడంతో పాటు 'ఆ చల్లని సముద్ర గర్భం' పాట పాడి తన ఉద్యమ రూపాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా పరకాల విజయ్ పివి శ్రీనివాస్ పై పాడిన పాట స్నేహితులందరినీ సంతోషపరిచింది. అదేవిధంగా పమ్మి రవి కళాకారుల బృందం తెలంగాణ పాటలతో ఉర్రూతలూగించారు. పీవీ శ్రీనివాస్ మిత్రులు, అభిమానులు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని శాలువాలు, పూలమాలతో పీవీ శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కార్యదర్శి చిర్రా రవి, టీ న్యూస్ బ్యూరో వెన్నెబొయిన సాంబశివరావు, టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షకార్యదర్శులు వనం వెంకటేశ్వరావు, ఏనుగు వెంకటేశ్వరావు, కవితా విద్యా సంస్థల అధినేత ఉషాకిరణ్, ప్రకృతి వైద్యులు కెవై రామచందర్రావు, ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ జిల్లా నాయకులు జైపాల్, కూరపాటి రంగరాజు, కె దిలీప్, యర్రమల్ల శ్రీను, నందగిరి శ్రీను, సాగర్, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు విప్లవ్ కుమార్, వర్తక సంఘం జిల్లా నాయకులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, రైతుసంఘ నాయకులు నల్లమల వెంకటేశ్వరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షకార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, మందుల ఉపేందర్, చక్రవర్తి, జగదీష్, ఐజేయు నాయకులు వేణు, భూపాల్, చెరుకుపల్లి శ్రీనివాస్, ఆకుల గాంధి, పారా నాగేశ్వరరావు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పమ్మి రవి, ప్రముఖ గాయకులు ఎస్.పాల్, పరకాల అజయ్, విజయ్, పుల్లారావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.