calender_icon.png 25 May, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు ప్రణాళికను రూపొందించుకోవాలి

24-05-2025 11:05:22 PM

ఏఈఓ ముత్యం తిరుపతి...

మందమర్రి (విజయక్రాంతి): వాతావరణంలో వస్తున్న మార్పులను బట్టి పంట కాలాలలో మార్పులను పాటించాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగా పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి(Mandal Agricultural Extension Officer Mutyam Tirupati) కొరారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా శనివారం మండలంలోని చిర్రకుంట గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించి, వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రైతులు విత్తనాల కొనుగోల్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదు, రసీదు తో పాటుగా విత్తనాల సంచులను భద్రపరచుకోవాలని, దీంతో పంట క్రమంలో జరిగే నష్టానికి విత్తన డీలర్ తో పరిహారం పొందవచ్చునని వివరించారు. పచ్చి రొట్టె వినియోగంతో భూసారం పెరడమే కాకుండా భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల చర్యలు మెరుగుపడి, భూమి సారవంతంగా మారుతుందని, దీంతో వేసే పంటకు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 50 మంది రైతులు వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీ అగ్రీ  స్టాక్ యాప్ లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.