calender_icon.png 25 May, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసిపి మాధవిని మర్యాదపూర్వకంగా కలిసిన సిలువేరు శ్రీకాంత్..

24-05-2025 11:02:05 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని ఏసీపి కార్యాలయంలో ఏసీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన వాసంశెట్టి మాధవిని శాసనమండలి కాంటెస్ట్ అభ్యర్థి సిలివేర్ శ్రీకాంత్ శనివారం కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో గంజాయి ఏరులై పారుతుందని విద్యార్థులు గంజాయి మత్తులో పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గంజాయి వద్దు చదువే ముద్దు అనే నినాదంతో ముందుకు పోయేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఏసిపి వాసంశెట్టి మాధవిని కోరారు. తక్షణమే స్పందించిన ఆమె తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శానకొండ  సంపత్ రావుతో పాటు తదితరులు ఉన్నారు.