calender_icon.png 8 November, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ నిల్వలు సీజ్

08-11-2025 12:05:14 AM

బూర్గంపాడు,నవంబర్ 7,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం బుడ్డగూ డెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 ట్రాక్టర్ల ఇసుకను శుక్రవారం రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. అనంతరం తహశీల్దార్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్ బృం దం కలసి బుడ్డగూడెం ఇసుక రీచ్ వద్ద జేసి బి తో కందకాలు తవ్వించారు. కందకాలు పూడ్చి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అ నంతరం పట్టుబడిన ఇసుకను తహశీల్దార్ ప్రసాద్ సమక్షంలో వేలం నిర్వహించగా మో రంపల్లి బంజర గ్రామానికి చెందిన మూల బాలిరెడ్డి రూ.88,000 దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మేడా ప్రసాద్,దేవ్ సింగ్,ఆర్‌ఐలు వీర్రాజు,నరసింహారావు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.