calender_icon.png 8 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

08-11-2025 12:06:38 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 7, (విజయక్రాంతి):దొంగతనం చేయడానికి ప్రయ త్నించిన గ్యాంగ్ ను అరెస్టు చేసిన పాల్వంచ పోలీసులను ఎస్పి రోహిత్ రాజ్ శుక్రవారం అభినందించారు.గురువారం అర్దరాత్రి 2గంటల సమయంలో పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ నందు పాల్వంచ సీఐ సతీష్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా అదే ప్రాంతంలో ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన 9 మంది దుండగులను పట్టుకోవడం జరిగింది.

కత్తు లు,మాస్కులు, ఇనుప రాడ్లతో రెండు కార్ల తో తిరుగుతూ పట్టుబడిన 9 మందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిన పాల్వంచ పోలీస్ అధికారులు సిబ్బందిని ఈ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందిచా రు. ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో భాద్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేస్తూ,వారి రక్షణ కొరకు పాటుపడే అధికారులు, సిబ్బందికి ఎప్పటికైనా మంచి పేరు లభిస్తుందని అన్నా రు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,సీఐ సతీష్,ఎస్త్స్ర సుమన్, కానిస్టేబుళ్ళు హుస్సేన్,అబ్బురాములు పాల్గొన్నారు.