08-11-2025 12:05:21 AM
మంథని నవంబర్ 07(విజయ క్రాంతి) మంథని సర్కిల్ లో రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంథని సీఐ రాజు హెచ్చరించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని ఏసిపి మడత రమేష్ ల సూచన మేరకు మంథని సర్కిల్ పరిధిలోని మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ రాజు రౌడీ షీటర్లతో మాట్లాడుతు రౌడీషీటర్స్ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయని, అలాంటి వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిగా ఏర్పాటు చేసిందని, రౌడీ షీటర్ల పట్ల చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గతంలో తెలిసి తెలియక మీరు తప్పులు చేశారని, ఇప్పటికైనా మీ ప్రవర్తనలో మార్పు వస్తే పోలీస్ శాఖ మీకు సహకరిస్తుందని సూచించారు. మీరు మారకుండా మళ్లీ రౌడీ షీటర్ లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులు చేస్తే మీపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సీఐ వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎస్‌ఐ రమేష్, సిబ్బంది ఉన్నారు.