22-09-2025 12:01:41 AM
అమీన్ పూర్ ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీవాసుల ర్యాలీ
అమీన్ పూర్, సెప్టెంబర్ 21 :అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ సువ ర్ణ వ్యాలీ కాలనీవాసులు మౌలిక సదుపాయాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీవాసుల ప్రధాన సమస్యలైన సీసీ రోడ్లు, డ్రైనేజ్ నీటి సమస్య, సమీపంలోని జనప్రియ అపార్ట్మెంట్స్ నుం డి కాలనీ లోపలికి డ్రైనేజ్ నీరు వస్తుందన్నారు.
పరిశుభ్రమైన వాతావరణం కోసం, ప్రతి పౌరుడు పొందాల్సిన ప్రాథమిక సౌకర్యాలను మాకు అందించాలని కాలనీవా సులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలి కాలనీవా సుల సమస్యలను పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సువర్ణ వ్యాలీ అసోసియేషన్ మెంబర్స్, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.