22-09-2025 12:02:11 AM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రజలు శాంతియుత వాతావరణం లో దసరా, దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు. ఉత్సవాలకు పగడ్బందీ భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
ప్రతి దుర్గా దేవి మండపం నిర్వాహకులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల నిర్వాకుల పూర్తి బాధ్యత వారిదేనని అన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. శోభయాత్ర, నిమజ్జనం ఏర్పాట్లు పోలీసులు సూచించిన సమయాన్ని పాటించాలన్నారు.