30-08-2025 09:26:52 PM
సిపిఎం మండల కార్యదర్శి సాంబశివరావు
మణుగూరు (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని సుందరయ్య నగర్ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి సత్రంపల్లి సాంబశివరావు(CPM Mandal Secretary Satrampally Sambasiva Rao) డిమాండ్ చేశారు. శనివారం పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. డ్రైనేజీల సమస్య వల్ల దోమలు అధికంగా ఉండి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. చెత్తా చెదారంతో కాలనీలు కంపు కొడుతున్నాయన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఆందోళనలో తప్పవన్నారు. నాయకులు కొడిశాల రాములు, నైనారపు నాగేశ్వరరావు, సాంబయ్య, పాల్గొన్నారు.