30-08-2025 09:23:40 PM
సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో మహిళా వ్యవసాయ విస్తరణ అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో నూతనకల్ మండల వ్యవసాయ అధికారి మురళి బాబును జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) సస్పెండ్ చేశారు. ఫోన్ కాల్స్ ద్వారా మహిళ వ్యవసాయ విస్తరణ అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నూతనకల్ మండల వ్యవసాయ అధికారి పి.మురళి బాబుపై ఆరోపణ విచారణ జరపగా నిజమని తేలింది. ఇదే సంఘటనపై శుక్రవారం తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి ఎన్. బాలకృష్ణ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్. ఏది ఏమైనా సఖ్య సమాజంలో మహిళ ఉద్యోగుల పట్ల ఉన్నత అధికారులు ఈ విధంగా చేయడం సిగ్గుచేటని మేధావులు అభివర్ణిస్తున్నారు.