12-10-2025 12:24:34 AM
ప్రత్యేక ఆకర్షణగా శివరామాలయాలు
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో హైదరాబాద్-- రహదారి పక్కన ఉన్న మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం హిందూ భక్తులకు పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 2కిలో మీటర్ల దూరంలో ఉన్న మెట్టుగుట్ట పూర్వం ‘మణిగిరి’గా పిలువబడేది.
55 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పర్వత శిఖరం ‘శివ-విష్ణు’ అభేదాన్ని సూచించే హరిహర రూపాన్ని కలిగి ఉంది. దక్షిణ కాశీగా పేరుపొందిన ఈ ఆలయం రామాయణం, మహాభారత గాథల్లో ప్రస్తావించబడినట్టు అనేక పురాణ గాథలు చెబుతున్నాయి.
కాశీ విశ్వేశ్వర లింగానికి సమానమని..
మెట్టుగుట్ట చరిత్ర క్రీ.శ. 950లో వేంగి చాళుక్యుల కాలం నుంచి నిర్మాణం ప్రారంభమవుతుంది. కాకతీయులు 12వ శతాబ్దంలో (1198- ఈ గుట్టపై కోట, ఆలయాలు నిర్మించారు. శివాలయం, రామాలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. శివలింగం మట్టిలోంచి 45 డిగ్రీల కోణంలో ఉద్భవించిన స్వయంభూ లింగంగా పరిగణించబడుతుంది. ఇది కాశీ విశ్వేశ్వర లింగానికి సమానమని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ ప్రాముఖ్యతలు
ఈ ఆలయంలో శివుడు (సిద్ధేశ్వరమూర్తి), శ్రీరాముడు, వీరభద్రస్వామి, గణపతి, ఆంజనేయుడు, సంతాన వేణుగోపాల స్వామి, అన్నపూర్ణ దేవతలు కొలువైనారు. గుట్టపై తొమ్మిది గుండాలు (కొలనులు) ఉండటం విశేషం. వీటిలో పాలగుం డం, జీడిగుండం ప్రసిద్ధి. పాలగుండం సర్వరోగ నివారణ కు, పాపనాశనానికి పవిత్రంగా భావిస్తారు. గుట్ట చుట్టూ 7 వసంతాలు ఉండి, ఇవి పాతాళ గంగను కలిగి ఉన్నాయని నమ్మకం.
ఒక వసంతం రామప్ప ఆలయానికి 100 కి.మీ. దూరంలో ఉందని చెబుతారు. కథల ప్రకారం మండవ్య, మద్రీచి, సందిల్య మొదలైన తొమ్మిది ఋషుల పాతుక ద్వారా శివుడు వర్షాలు కురిపించాడని, శ్రీరాముడు, సీతాదేవి బద్రాచలం వెళ్లేటప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్నారని నానుడి.
భీముడి భార్య హిడింబి రాళ్లతో ఆట ఆడినట్టు 165 అడుగుల ఎత్తులో ధోమతలమ్మ రాళ్లతో కూడిన పర్వతాలు ఏర్పడ్డాయని భక్తుల నమ్మకం. వానమాలై వరదాచార్యులు (పోతన) ఇక్కడ వాగీశ్వరి ఉపాసన చేసి తెలుగులో భాగవతాన్ని రాశారు. పండుగలు, విశేషాలు
మహాశివరాత్రి పర్వదినం రోజున శివపార్వతీ కల్యాణోత్సవం, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా సీతారామ కల్యాణ మహోత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసంలో వరలక్ష్మి వ్రతం, దసరా పండుగ కూడా వేడుకగా నిర్వహిస్తారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి కి అత్యంత సమీపంలో ఉన్న మెట్టుగుట్టను భక్తులు మెట్ల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి