07-11-2025 12:22:26 AM
జాతీయ రహదారిపై అన్నదాతల ఆందోళన
బేల, నవంబర్ 6 (విజయక్రాంతి): బేల మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో సొయా కొనుగోళ్లు తొలిరోజే ఆందోళన కు దారి తీసింది. సొయా పంట లో తేమ శాతం అధికంగా ఉన్నందున కొనుగోలు చేపటమని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేపట్టారు. దాదాపుగా గంట వరకు రైతులు రహదారిపై నిరసన చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
రైతుల నిరసనకు బిఆర్‌ఎస్ శ్రేణులు మద్దతు పలికారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ రఘునాథ్ రావ్ రైతుల వద్దకు వచ్చి మీ న్యాయపరమైన డిమాండ్ ను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని ఎంత చెప్పిన రైతులు వినుపించుకోలేదు.. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం ఎలాంటి తేమ శాతం లేకుండా బేషరతుగా సొయా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ అధికారులు ఎవ్వరు కూడా క్షేత్ర స్థాయిలో వెళ్లకుండానే ఎకరానికి 6 క్వింటాల దిగుబడి వచ్చిందని ఎలా చెప్తార అని వ్యవసాయ అధికారుల పని తీరు పైన మండిపడ్డారు. ఈ రోజు ప్రతి రైతుకి ఎకరానికి 9 నుండి 10 క్వింటాల సొయా దిగుబడి వచ్చిందని మార్క్ ఫెడ్ అధికారులు ఖచ్చితంగా రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులందరు ప్రతి రోజు నిరసనలు, రాస్తారోకులు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.